ఆన్‌లైన్ రిలేషన్‌షిప్.. టెంపరరీ సెక్సువల్ పార్టనర్ కోసం వెతుకుతున్న యువత

by Disha Web Desk 6 |
ఆన్‌లైన్ రిలేషన్‌షిప్.. టెంపరరీ సెక్సువల్ పార్టనర్ కోసం వెతుకుతున్న యువత
X

దిశ, ఫీచర్స్: పరస్పరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం, దీర్ఘకాలిక పరిచయం ద్వారా మాత్రమే ప్రేమలు, రిలేషన్‌షిప్స్ ఏర్పడుతుంటాయని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇటీవల వరల్డ్‌ వైడ్ ట్రెండ్ మారుతోంది. ఎటువంటి పరిచయం లేని వ్యక్తితో కూడా క్షణాల్లో బంధాలు ముడిపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికలు, డేటింగ్ యాప్‌లు అందుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. న్యూ జనరేషన్ తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, తాత్కాలిక రిలేషన్‌షిప్ కొనసాగించడానికి ఎక్కువగా వాటిపై ఆధారపడుతున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది.

నచ్చిన భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రతీ పది మందిలో ముగ్గురు డేటింగ్ సైట్స్ లేదా యాప్‌ని యూజ్ చేస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ స్టడీ రిపోర్టు పేర్కొన్నది. 35 సంవత్సరాల వయస్సు గలవారిలో సగం కంటే ఎక్కువ మంది ఈ ప్రయత్నం చేస్తున్నారట. గత సంవత్సరం 15 శాతం మంది యూఎస్ అడల్ట్స్ తాము డేటింగ్ సైట్ లేదా యాప్‌ని యూసి పార్టనర్‌ను చూస్ చేసుకున్నట్లు అధ్యయనం వెల్లడించింది. అంతేగాక లవ్, డేటింగ్, ఎమోషనల్ వంటి అంశాలను యువత ఆన్‌లైన్ వేదికగా చర్చిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు.

ఆశ్చర్యం ఏంటంటే.. లైఫ్ పార్టనర్‌ను కలిగి ఉన్న ప్రతీ 10 మందిలో ఒకరు కేవలం ఎక్స్‌ట్రా సెక్సువల్ రిలేషన్ కోసం డేటింగ్ సైట్ లేదా యాప్‌లో ఇతర వ్యక్తులను కలుసుకుంటున్నారు. ఇలా చేస్తున్న యువతీ యువకుల్లో 30 ఏళ్లలోపు వయస్సుగలవారే అధికంగా ఉంటున్నారు. ఇక 44 శాతం మంది తాము లైఫ్ పార్టనర్‌ను ఆన్‌లైన్ వేదికగా ఎన్నుకున్నట్టు స్టడీలో వెల్లడైంది. 40 శాతం మంది సాధారణంగా డేటింగ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. 24 శాతం మంది ఓన్లీ సెక్స్ రిలేషన్ కోసం మాత్రమే ఆన్ లైన్‌లో పార్టనర్స్‌ను వెతుకుతున్నారు. 22 శాతం మంది కొత్త స్నేహితుల కోసం వెతుకుతున్నారు.

Also Read: చనిపోయిన వ్యక్తి కలలో ఏడుస్తూ కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?



Next Story

Most Viewed