కిడ్నీలో రాళ్లను పోగొడ్తున్న బీర్.. 50 కోట్ల భారతీయుల నమ్మకం

by Disha Web Desk 7 |
కిడ్నీలో రాళ్లను పోగొడ్తున్న బీర్.. 50 కోట్ల భారతీయుల నమ్మకం
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ స్టోన్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మూత్రపిండాల్లోని ఖనిజాలు, లవణాలతో ఏర్పడిన ఈ హార్డ్ డిపాజిట్స్ విపరీతమైన నొప్పితో.. మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. కిడ్నీ వాపుకు కారణమవుతాయి. అయితే దీనిపై జరిపిన పాన్-ఇండియా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారిలో 50 శాతానికి పైగా ప్రజలు బీర్ తాగడం ద్వారా తగ్గిపోతాయని నమ్ముతున్నారు.

ఈ పద్ధతిని ప్రయత్నించడంలో భాగంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. స్టడీ ప్రకారం ముగ్గురు భారతీయుల్లో ఒకరు బీర్ కిడ్నీ స్టోన్స్‌ను రిమూవ్ చేస్తుందని నమ్ముతున్నారు. కానీ ఇదంతా అవాస్తవమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 50 కోట్ల మందికిపైగా ఈ అపోహతో తప్పు చేస్తున్నారని, ఇలాంటి మూఢనమ్మకాలతో కాలయాపన చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed