5 ఆసుపత్రులపై చర్యలు.. కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లు రద్ధు

by  |
5 ఆసుపత్రులపై చర్యలు.. కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లు రద్ధు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఫిర్యాదులందిన మరో 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లు రద్ధు చేస్తున్నట్టుగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. ప్రభుత్వం అందించిన షోకాజ్ నోటీసులకు సరైన వివరణలు అందించకపోవడం వలన తగిన చర్యలు చేపట్టామని శనివారం ఆయన ప్రకటనను విడుదల చేశారు.

అమీర్‌పేటలోని ఇమేజ్ ఆసుపత్రి, ఎల్.బి నగర్‌లోని అంకూర్ ఆసుపత్రి, కొండాపూర్‌లోని సియా లైఫ్ ఆసుపత్రి, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్‌పూర్‌లోని పంచవటీ ఆసుపత్రి, సంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్‌లోని సాయి సిద్ధార్థ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సలు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 10 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల లైసెన్స్‌లను రద్ధు చేశామని తెలిపారు. శనివారం కొత్తగా ప్రైవేటు ఆసుపత్రులపై మరో 27 ఫిర్యాదులందయాని చెప్పారు. దీంతో మొత్తం ఫిర్యాదులు 115కి చేరుకున్నాయని తెలిపారు. కొత్త ఫిర్యాదులతో కలిపి మొత్తం 79 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు అందించామని వివరించారు.


Next Story