లూయిస్ హామిల్టన్‌కు అరుదైన గౌరవం

by  |
లూయిస్ హామిల్టన్‌కు అరుదైన గౌరవం
X

దిశ, స్పోర్ట్స్ : ఫార్ములా వన్ రేసర్ లూయీస్ హామిల్టన్ ఇకపై ‘సర్’ లూయీస్ హామిల్టన్. గత నవంబర్‌లో ఏడో సారి ఫార్ములా వన్ టైటిల్ గెలిచి దిగ్గజ రేసర్ మైఖెల్ షూమాకర్ సరసన చేరిన హామిల్టన్‌‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌లో ఇచ్చే అరుదైన గౌరవ పురస్కారాన్ని కొత్త సంవత్సరం వేళ హామిల్టన్‌కు ఇవ్వనున్నారు. ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ఈ గౌరవాన్ని ఈ సారి క్రీడారంగం తరపున లూయీస్ హామిల్టన్‌కు అందజేయనున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని బృందం హామిల్టన్‌కు ‘సర్’ గౌరవాన్ని ఇవ్వడానికి సిఫార్సు చేసింది.

బ్రిటన్‌లోనే పుట్టిన హామిల్టన్ ఫార్ములా వన్‌లో గొప్ప రేసర్ అనిపించకున్నాడు. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హామిల్టన్‌ గత నవంబర్‌లో ఏడో టైటిల్ గెలిచి షూమాకర్ సరసన నిలిచాడు. ‘సర్’ గౌరవాన్ని అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో నాలుగో వ్యక్తిగా హామిల్టన్ నిలిచాడు. ఈ గౌరవంపై హామిల్టన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ కరోనా కాలంలో ఎక్కువ రేసుల్లో పాల్గొనలేకపోయినా.. ఈ ఏడాది ఏడో టైటిల్ గెలవడం ఆనందంగా ఉన్నది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నుంచి నేను కూడా స్పూర్తి పొంది మరింతగా ట్రాప్‌పై రాణించాను’ అని హామిల్టన్ అన్నాడు.



Next Story

Most Viewed