స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుదాం..ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి..

by  |
స్వచ్ఛ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుదాం..ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి..
X

దిశ, దేవరకద్ర: మండల కేంద్రంలో పట్టణ పరిశుభ్రత, పారిశుధ్యం కోసం చెత్తసేకరణ వాహనాలను దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వీధిలో సులభంగా చెత్తను సేకరించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో, గ్రామ పంచాయతీ నిధులతో రెండు మినీ వాహనాలను మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడు కోవాలన్నారు. ఎవరు కూడా చెత్తను బయట పడవేయకుండా ఈ చెత్త సేకరణ వాహనాలలో వేయాలన్నారు.

ఈకార్యక్రమంలో అందరూ బాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ గ్రామపంచాయితిగా, స్వచ్ఛ తెలంగాణ గా తీర్చి దిద్ద గలమన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, దేవరకద్ర సర్పంచ్ కొండ విజయలక్ష్మి, ఎంపీపీ రమ శ్రీకాంత్ యాదవ్, టీఆర్‌స్ మండలనాయకులు జెట్టినరసింహరెడ్డి, దొబ్బలి అంజి, శ్రీకాంత్ యాదవ్, కొండ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Next Story

Most Viewed