కేసీఆర్ స్పందిస్తే ఓకే.. లేకపోతే రాష్ట్రపతి వద్దకు వెళ్తాం

by  |
Ex-Servicemens Association
X

దిశ, ఖైరతాబాద్: భారత మాజీ సైనికులపై అకారణంగా దాడి చేయడమే గాక, దుర్భాషలాడిన కాగజ్‌నగర్ టౌన్ సీఐ మోహన్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాజీ సైనికుల సమాఖ్య కార్యదర్శి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాగజ్‌నగర్ టౌన్‌లోని భూ వివాదం విషయంలో మాజీ సైనికుడు కే.శివను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, సీఐ మోహన్ దాడి చేసి, దుర్భాషలాడారని మండిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా, కనీసం విచారించకుండా మాజీ సైనికుడిపై దాడి చేసి, ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలు స్పందించి, సదరు సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed