ఎల్బీనగర్ డీ-మార్ట్ సీజ్ !

by  |
ఎల్బీనగర్ డీ-మార్ట్ సీజ్ !
X

దిశ, న్యూస్ బ్యూరో: సామాజిక దూరం నిబంధనలు పాటించని కారణంగా ఎల్బీనగర్ డీ-మార్ట్‌ను జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం సీజ్ చేసింది. లాక్‌డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లకు మినహాయింపునిచ్చినా.. వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేయడంలో డీ- మార్ట్ నిర్వాహకులు విఫలమైనట్టుగా అధికారులు గుర్తించారు. గతంలోనూ ఈ విషయంపై నోటీసులు జారీ చేసినా.. నిబంధనల అమలులో జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో స్టోర్‌ను సీజ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనల అమలుపై తనిఖీలను నిర్వహిస్తూ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం వెల్లడించింది.

Tags : LB Nagar, Lock down rules, social distance, D-mart, GHMC

Next Story

Most Viewed