నా హయాంలో ఎవరికీ అన్యాయం జరగొద్దు: సీఎం యోగీ అదిత్యనాథ్

by Disha Web Desk 1 |
నా హయాంలో ఎవరికీ అన్యాయం జరగొద్దు: సీఎం యోగీ అదిత్యనాథ్
X

దిశ, వెబ్ డెస్క్: తన హయాంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని సీఎం యోగీ అదిత్యనాథ్ అధికారులను అదేశించారు. బుధవారం ఆయన ప్రజలతో నేరుగా ముచ్చటించే 'జనతా దర్శన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 700 మంది బాధితులు సీఎంతో నేరుగా తమ సమస్యలను విన్నవించారు. ఓ మహిళ తన ఇల్లును కొందరు ధ్వంసం చేశారని విన్నవించింది. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ ఏ మాత్రం ఆందోళన చెందకూడదని, తన హయాంలో పేదలు, బలహీనులను ఎవరూ నాశనం చేయలేదని ఆయన అన్నారు.

అక్రమంగా భూములు ఆక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు సూచించారు. సదరు మహిళ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలంటూ అధికారులు, పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ముఖ్యమంత్రిని కలిసి వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని కోరారు. అదేవిధంగా కొందరు వికలాంగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారి ప్రాధాన్యతపై ఉన్నతాధికారులతో చర్చించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


Next Story