ఆశాభావంలో మంత్రి పువ్వాడ

by  |
ఆశాభావంలో మంత్రి పువ్వాడ
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కూసుమంచి మండలం లోక్య తండా గ్రామానికి చెందిన వడ్తియా సెట్రాం నాయక్ తో చైర్మన్ గా జిల్లా మార్కెట్ అధికారి నాగరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ పాలకవర్గం నుతన కమిటీ రైతుల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు.

ఆగస్టు మొదటి వారంలోనే సాగర్ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాబోయే కాలంలో సాగర్ నీరు వచ్చినా రాకపోయినా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. వచ్చే దసరా కల్లా రైతు వేదికను పూర్తి చేయాలని, పాలేరు నియోజకవర్గం ఈ విషయంలో ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసిఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాతా మధు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపిపి వజ్జా రమ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్,మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story