రైతుబంధు దరఖాస్తుకు ఈనెల 30వరకు ఛాన్స్

by  |
రైతుబంధు దరఖాస్తుకు ఈనెల 30వరకు ఛాన్స్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతులందరికీ రైతుబంధు వర్తింప చేసేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ 16వరకు పట్టాదారు పుస్తకాలు తీసుకున్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30లోగా కొత్త పట్టాదారు పుస్తకాలు ఉన్న రైతులు రైతుబంధు దరఖాస్తు ఫారాలతో ఆధార్ కార్డు, బ్యాంకు జిరాక్స్ కాపీలతో సంబంధిత మండలాల ఏఈఓలకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. వీరందరికీ రైతుబంధు వర్తింప చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 54లక్షలకుపైగా రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రూ. 6,886 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. కొత్త పట్టాదారు పొందిన రైతులకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. దీంతో మరో 2.10 లక్షల మంది వరకు రైతుబంధు సాయం పొందుతారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

Next Story

Most Viewed