దసరాలోపు రూపాయికే నల్లా కనెక్షన్ : కేటీఆర్

by  |
KTR twitter
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ వేములవాడ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే దసరాలోపు వేములవాడలో ఇంటింటికీ రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 60 శాతం తాగు నీటి వసతి ఏర్పాటు పూర్తయ్యిందన్నారు. అదేవిధంగా రైతు బజార్ నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

100 పడకల ఆస్పత్రిలో రూ.40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో వైకుంఠధామం ఏర్పాటు పూర్తవుతుందని వివరించారు. ప్రతీ మున్సిపాలిటికి డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed