మోబైల్ యాప్‌తో.. ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేట్

by  |
మోబైల్ యాప్‌తో.. ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేట్
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో చాలామందికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఆక్సిజన్ లెవల్స్ కొలిచే ‘ఆక్సీమీటర్’ ప్రధాన్యం పెరిగింది. ప్రతి నాలుగు గంటలకోసారి ఆక్సిజన్ లెవల్స్ చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో, గత ఏడాది రూ.400 వందలు దొరికే ఈ పరికరం రూ.1500 – 2500 వరకు రేటు పెంచారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో ఆ పరికరం కోసం డబ్బులు వెచ్చించడం అందిరితో కాదు. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాకు చెందిన హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘కేర్‌నో హెల్త్‌కేర్’ స్మార్ట్‌ఫోన్ ఆధారిత అప్లికేషన్ ‘కేర్‌ప్లిక్స్ వైటల్’ ను అభివృద్ధి చేసింది.

‘కేర్‌ప్లిక్స్ వైటల్’ రిజిస్ట్రేషన్ ఆధారిత అప్లికేషన్. ఈ యాప్ ఏఐ సాయంతో ఆక్సిజన్ లెవల్స్‌ను నిర్ధారిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఫ్లాష్‌లైట్‌పై వేలు పెట్టగానే.. క్షణాల్లో ఆక్సిజన్ సంతృప్తత (SpO2) స్థాయిలతో పాటు పల్స్, రెస్పిరేషన్ రేటు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 40 సెకన్ల వ్యవధిలోనే ఆయా రీడింగ్స్ తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వాటిని రికార్డ్ కోసం క్లౌడ్‌లో సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్ పనితీరు తెలుసుకునేందుకు కోల్‌కతాలోని సేథ్ సుఖ్లాల్ కర్ణాని మెమోరియల్ హాస్పిటల్‌లో ఈ ఏడాది ప్రారంభంలో 1200 మంది వ్యక్తులతో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఆసుపత్రిలోని వైద్యులతో పరీక్షలు ప్రధానంగా OPD(ఔట్ పేషెంట్స్ డిపార్ట్‌మెంట్) లో జరిగాయి. కచ్చితత్వాన్ని పరీక్షించడానికి ఆక్సీమీటర్‌ రీడింగ్స్‌తో పోల్చి చూశాం. కేర్‌ప్లిక్స్ వైటల్ హృదయ స్పందనలతో 96 శాతం కచ్చితమైనదని, ఆక్సిజన్ శాచ్యురేషన్ విషయంలోనూ 98 శాతం ఉందని కర్ణాని మెమోరియల్ వైద్యులు తెలిపారు.

ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవల్స్, పల్స్ రేటు వంటి ప్రాణాధారాలను పొందడానికి ప్రజలకు పల్స్ ఆక్సిమీటర్ లేదా స్మార్ట్ వాచ్ వంటివి అవసరం. వీటన్నిటిలో అంతర్లీన సాంకేతికత ఫోటోప్లెథిస్మోగ్రఫీ లేదా పిపిజి ఉంటుంది. మేము దీన్ని స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఫ్లాష్‌లైట్ ద్వారా అందించగలిగాం. దేశంలో కార్డియోవాస్య్కులర్ మరణాలు ఎక్కువ కావడంతో ఎలాగైనా దాన్ని నిరోధించాలనే ఆలోచనల్లోంచి ఈ యాప్ అభివృద్ధి చేశాం.

మా నాన్న వైద్యుడు తనతో నా ఆలోచన పంచుకున్నాను. నా సోదరుడు అభిషేక్ ఆధ్వర్యంలోని కేర్‌ప్లిక్స్ హెల్త్‌కేర్ సంస్థ 2016లో ప్రారంభమైంది. మేము గత సంవత్సరం ఈ యాప్‌పై మా కార్యకలాపాలను ప్రారంభించాము. ఆపరేషన్స్, క్లినికల్ ట్రయల్ టీం నుంచి అంకిత్ సాహా. వితిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం నుంచి పాతిక్రిత్ సన్యాల్‌తో పాటు చెన్నైకి చెందిన స్వరూప్ ఆనంద్ ఈ పరిశోధనలో భాగస్వాములుగా ఉన్నారు. మొత్తంగా అనేక మార్పులు ప్రోటోటైప్స్ తర్వాత ఫైనల్ ఔట్‌పుట్‌గా ఇది సిద్ధమైంది.
– మోనోసిజ్ సేన్‌గుప్తా, సహ వ్యవస్థాపకుడు

Next Story

Most Viewed