టాప్ ఆర్డర్ విఫలం.. రాజస్తాన్ ఓటమి

by  |
టాప్ ఆర్డర్ విఫలం.. రాజస్తాన్ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 54వ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ లక్ష్య ఛేదనలో చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 60 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్జ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. రాజస్తాన్‌లో ముఖ్యంగా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అవడంతో RR జట్టు ఘోరా పరాజయం చెందింది. దీనికి తోడు ప్యాట్ కమ్మిన్స్ తొలి పవర్ ప్లే లోనే 4 కీలక వికెట్లు తీసుకోవడంతో నైట్ రైడర్స్ విజయం లాంఛనమైంది.

రాజస్తాన్ బ్యాటింగ్‌:

192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే కుప్పకూలింది. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రాజస్తాన్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. వచ్చిన వారిని వచ్చినట్టే మైదానం వీడేలా చేశాడు. తొలి పవర్ ప్లే లోనే మూడు ఓవర్లు వేసిన కమ్మిన్స్ 29 పరుగులైతే ఇచ్చాడు కానీ.. ఏకంగా 4 కీలక వికెట్లను తీసుకున్నాడు. 2 బంతులు ఆడి 1 సిక్సర్ కొట్టిన రాబిన్ ఉతప్ప 19 స్కోర్ బోర్డు వద్ద ఔట్ చేశాడు. ఆ తర్వాత 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 18 పరుగులు చేసి కుదురుకుంటున్న బెన్ స్టోక్స్‌ను కూడా 27 పరుగుల వద్దనే క్యాచ్ ఔట్ చేశాడు.

ఇక ఈ వికెట్‌తో ఒత్తిడికి గురైన రాజస్తాన్ ఆటగాళ్లు వికెట్లు వదిలేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ (4)లకే కమ్మిన్స్ క్లీన్ బోల్డ్ చేయగా.. సంజుశాంసన్(1) పరుగు చేసి శివం మావి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 32 పరుగులకే RR నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్‌(0)ను కూడా కమ్మిన్స్ డకౌట్ చేశాడు. దీంతో 37 పరుగులకే రాజస్తాన్ రాయల్స్ జట్టు ఏకంగా 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 5వ స్థానంలో వచ్చిన జోస్ బట్లర్ (35), 7వ స్థానంలో వచ్చిన రాహుల్ తెవాతియా (31) పరుగులతో పర్వాలేదనిపించారు. 80 పరుగుల వద్ద జోస్ బట్లర్ వెనుదిరగడంతో, 105 పరుగుల వద్ద రాహుల్ తెవాతియా కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 105లతోనే రాజస్తాన్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కుప్పకూలిపోయింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు టార్గెట్ ఛేదన అసంభవం అయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ కేవలం 131లకే పరిమితం కావడంతో కోల్‌కతా జట్టు 60 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

కోల్‌కతా బ్యాటింగ్:

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. కోల్‌కతాలో ముగ్గురు కీలక ఆటగాళ్లు డకౌట్ అయినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కోల్‌కతా 191 పరుగులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ మోర్గాన్ (68) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి(39), ఆండ్రూ రస్సెల్ (25), ప్యాట్‌కమ్మిన్స్(15) పరుగులతో రాణించారు. ఇక నితీష్ రానా, సునీల్ నరైన్, దీనేష్ కార్తీక్ లాంటి కీలక ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం. అయినప్పటికీ కోల్‌కతా స్కోరు ఏ మాత్రం తీసుపోకుండా 191 చేసి రాజస్తాన్ ముందు భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది.

స్కోర్‌బోర్డ్:

Kolkata Knight Riders Innings: 191-7 (20 Ov)

1. శుబ్‌మన్ గిల్ c జోస్ బట్లర్ b రాహుల్ తెవాతియా 36(24)
2. నితీష్ రానా c శాంసన్ b జోఫ్రా ఆర్చర్ 0(1)
3. రాహుల్ త్రిపాఠి c ఉతప్ప b శ్రేయస్ గోపాల్ 39(34)
4. సునీల్ నరైన్ c స్టోక్స్ b రాహుల్ తెవాతియా 0(2)
5. ఇయాన్ మోర్గాన్ (c) నాటౌట్ 68(35)
6. దినేష్ కార్తీక్ (wk)c స్టీవ్ స్మిత్ b రాహుల్ తెవాతియా0(1)
7. ఆండ్రూ రస్సెల్ c (sub)మిల్లర్ b కార్తీక్ త్యాగి 25(11)
8. ప్యాట్ కమ్మిన్స్ c శాంసన్ b కార్తీక్ త్యాగి15(11)
9. కమలేష్ నాగర్‌కోటి నాటౌట్ 1(1)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 191-7

వికెట్ల పతనం: 1-1 (నితీష్ రానా, 0.2), 73-2 (శుబ్‌మన్ గిల్, 8.3), 74-3 (సునీల్ నరైన్, 8.6), 94-4 (రాహుల్ త్రిపాఠి, 11.6), 99-5 (దినేష్ కార్తీక్, 12.3), 144-6 (ఆండ్రూ రస్సెల్, 15.3), 184-7 (ప్యాట్ కమ్మిన్స్, 19.2)

బౌలింగ్:
1. జోఫ్రా ఆర్చర్ 4-0-19-1
2. వరుణ్ ఆరోన్ 2-0-22-0
3. శ్రేయస్ గోపాల్ 3-0-44-1
4. బెన్ స్టోక్స్ 3-0-40-0
5. రాహుల్ తెవాతియా 4-0-25-3
6. కార్తీక్ త్యాగి 4-0-36-2

Rajasthan Royals Innings: 131-9 (20 Ov)

1. రాబిన్ ఉతప్ప c నాగర్ కోటి b కమ్మిన్స్ 6(2)
2. బెన్‌స్టోక్స్ c కార్తీక్ b కమ్మిన్స్ 18(11)
3. స్టీవ్ స్మిత్ (c)b కమ్మిన్స్ 4(4)
4. సంజూ శాంసన్ (wk)c కార్తీక్ b శివం మావి 1(4)
5. జోస్ బట్లర్ c కమ్మిన్స్ b చక్రవర్తి 35(22)
6. రియాన్ పరాగ్ c కార్తీక్ b కమ్మిన్స్ 0(7)
7. రాహుల్ తెవాతియా c కార్తీక్ b చక్రవర్తి 31(27)
8. శ్రేయస్ గోపాల్ నాటౌట్ 23(23)
9. జోఫ్రా ఆర్చర్ c శివంమావి b నాగర్‌కోటి 6(9)
10.కార్తీక్ త్యాగి c and b శివం మావి 2(3)
11. వరుణ్ ఆరోన్ నాటౌట్ 0(8)

ఎక్స్‌ట్రాలు: 5

మొత్తం స్కోరు: 131-9

వికెట్ల పతనం: 19-1 (రాబిన్ ఉతప్ప, 0.6), 27-2 (బెన్‌స్టోక్స్, 2.1), 32-3 (స్టీవ్ స్మిత్, 2.6), 32-4 (సంజూ శాంసన్, 3.3), 37-5 (రియాన్ పరాగ్, 4.6), 80-6 (జోస్ బట్లర్, 10.4), 105-7 (రాహుల్ తెవాతియా, 14.4), 125-8 (జోఫ్రా ఆర్చర్, 17.3), 129-9 (కార్తీక్ త్యాగి 18.3).

బౌలింగ్:
1. ప్యాట్ కమ్మిన్స్ 4-0-34-4
2. శివం మావి 4-1-15-2
3. వరుణ్ చక్రవర్తి 4-0-20-2
4. సునీల్ నరైన్ 4-0-37-0
5. కమలేష్ నాగర్‌కోటి 4-0-24-1



Next Story

Most Viewed