జీవీఎల్ అమిత్ షాను కలిస్తే.. మాకేంటి : కొడాలి నాని

by  |
Minister Kodali Nani
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యలను మంత్రి కొడాలని నాని తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీలో హిందూ ఆలయాల పైన దాడులు పెరిగిపోయాయన్న జీవీఎల్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొన్ని పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నయని మండిపడ్డారు. ఇలాంటివి అరికట్టేందుకు మతసామరస్య కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. బీజేపీకి ఉండే బలం బీజేపీకి ఉంటుంది.. వైసీపీకి ఉండే బలం వైసీపీకి ఉంటుందని వెల్లడించారు. దేశంలో బీజేపీ గొప్ప పార్టీ అయి ఉండొచ్చు.. కానీ, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. బీజేపీ బలం ఎక్కడో ఉందని, ఇక్కడకొచ్చి ఏందో చేద్దామంటే సాధ్యం కాదని సూచించారు. జీవీఎల్ ఒక బీజేపీ ఎంపీ.. హోం మంత్రి అమిత్ షాను ఆయన ఎప్పుడైనా కలవొచ్చు ఆయన, వాళ్లు ఏం మాట్లాడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదని అన్నారు.

Next Story

Most Viewed