పంచాయతీ కార్యదర్శులు క్రికెట్ లో రాణించాలి: ఎమ్మెల్యే బొల్లం

by  |
పంచాయతీ కార్యదర్శులు క్రికెట్ లో రాణించాలి: ఎమ్మెల్యే బొల్లం
X

దిశ, కోదాడ: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడంలో పంచాయతీ కార్యదర్శి పాత్ర కీలకమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముల గూడెం రోడ్ లో నెల మైదానంలో సూర్యాపేట జిల్లా పంచాయతీ సెక్రెటరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిది గా ఉండి గ్రామస్థాయి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారిని పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శుల సేవలు ప్రశంసనీయమన్నారు.

పంచాయతీ కార్యదర్శి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంద అన్నారు. పంచాయతీ కార్యదర్శులు జట్లుగా ఏర్పడి నిత్యం క్రికెట్ ను సాధన చేయడం అభినందనీయమన్నారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం క్రికెట్ జట్లు క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, నాయకుడు ఒంటి పులి నాగరాజు, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు దున్న విజయ్, నిర్వాహకులు దొంగరి వెంకటేశ్వర్లు, అక్షయ్, పృథ్వి, మోతిలాల్, ఉపేందర్, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed