సింపుల్‌గా కొబ్బరి పప్పు రెసిపీ

136

పప్పు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. మిరపకాయల పప్పు, కారం పప్పు, టమోటా పప్పు, మెంతి పప్పు ఇలా ఎన్నో రకాల రుచికరమైన పప్పు చేసుకుంటుంటాం. ఇలా కొబ్బరి పప్పు ఎంతో టెస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

పచ్చి కొబ్బరి – కాయలో సగం ముక్క
మంచినీళ్లు -1 కప్పు
పెసరపప్పు -1 కప్పు
పచ్చిమిర్చి -3
ఉల్లిపాయలు -2
ఆవాలు, జీలకర్ర -2 టీస్పూన్స్
నూనె -పోపుకు సరిపడా
కారం -1 టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం:

పచ్చికొబ్బరిని తురిమి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణిలో కొద్దిగా నూనె వేసుకుని, అది వేడయ్యాక ఆందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొబ్బరి తురుము, కారం, కరివేపాకు వేసి వేగించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పెసరపప్పు వేసి దానిలో మంచినీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దించేసుకుంటే కొబ్బరి పప్పు రెడీ.. వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పప్పుతో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.