మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అభినందనీయం: బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్

by  |
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అభినందనీయం: బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అభినందనీయమని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి బీసీ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వారిని వ్యాపారంలో భాగస్వాములు చేయడం కోసం వివిధ బీసీ కులాలు వారు కులవృత్తులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. మద్యం దుకాణాల్లో కూడా రిజర్వేషన్ అమలు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed