రీజనల్ రింగురోడ్డుకు జాతీయ హోదా ఇవ్వండి : కిషన్ రెడ్డి

by  |
రీజనల్ రింగురోడ్డుకు జాతీయ హోదా ఇవ్వండి : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో రీజనల్ రింగు రోడ్డు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా, ఇటీవలే కేంద్రప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా, దానికి 30కిలో మీటర్ల దూరంలో ఐదు జిల్లాలను కలుపుతూ కొత్త రీజనల్ రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ నేతల బృందం సోమవారం కేంద్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

334కిలో మీటర్ల దూరంలో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రూ.7,561కోట్లు ఖర్చు అవుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజనల్ రింగురోడ్డు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్‌తో పాటు పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.


Next Story

Most Viewed