బీసీసీఐ కాదు.. కేంద్రం ఓకే అంటేనే..: కిరణ్ రిజిజు

by  |
బీసీసీఐ కాదు.. కేంద్రం ఓకే అంటేనే..: కిరణ్ రిజిజు
X

దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్) నిర్వహించాలని బీసీసీఐ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఐసీసీని కూడా ఒప్పించి నవంబర్‌ నెలలో ఐపీఎల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన తాజా ప్రకటన బీసీసీఐ ప్రయత్నాలపై నీళ్లు జల్లినట్లైంది. ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. బీసీసీఐ కాదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రికెటర్లు, ప్రేక్షకుల ఆరోగ్యమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని, ఐపీఎల్ నిర్వహించడం ద్వారా ఎవరి ఆరోగ్యాలకూ ముప్పుండదని భావించినప్పుడే ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రం దృష్టంతా కరోనా నియంత్రణపైనే ఉందని, క్రీడల పునఃప్రారంభానికి ఇంకా ఆమోదం తెలుపలేదని చెప్పారు.

Next Story

Most Viewed