నాలుగు బంతుల్లో విజయాన్ని తెచ్చారు

by  |
నాలుగు బంతుల్లో విజయాన్ని తెచ్చారు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఎట్టకేలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్‌ను కోల్పోయింది. ఇక 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ అద్భుతంగా రాణించింది. క్రీజులోకి దిగిన క్రిస్ గేల్-మయాంక్ అగర్వాల్ పంజాబ్‌ను విజయతీరాలను చేర్చారు.

ముంబై తరఫున బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ తొలి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత పంజాబ్ బౌలర్ జోర్డాన్ వైడ్ వేశాడు. ఇక రెండో బంతిని ఆడిన హార్దిక్ పాండ్యా కూడా సింగిల్ మాత్రమే తీశాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన పొలార్డ్ ఫోర్ కొట్టాడు. దీంతో మూడు బంతుల్లో ముంబై 7 పరుగుల చేసింది. ఆ తర్వాతి బంతికి కూడా జోర్డాన్ వైడ్ వేశాడు. ఇక నాలుగో బంతికి రెండు పరుగులు చేసే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. ఇక ఐదో బంతి మాత్రం డాట్ అయింది. ఇక చివరి బంతి భారీ షాట్ ఆడిన పొలార్డ్ సిక్స్‌ను మయాంక్ అడ్డుకోవడంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ముంబై సూపర్‌ ఓవర్‌లో 11 పరుగులు చేశారు.

ఇక పంజాబ్ తరఫున బరిలోకి దిగిన క్రిస్ గేల్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతిని సింగిల్ తీశాడు. ఇక మూడో బంతి ఆడిన మయాంక్ ఫోర్ కొట్టాడు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఇక నాలుగో బంతిని కూడా మయాంక్ బౌండరీ బాదడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయాన్ని అందుకుంది. కేవలం తొలి నాలుగు బంతుల్లోనే గేల్-మయాంక్ పంజాబ్‌కు విజయాన్ని తెచ్చి పెట్టారు.



Next Story

Most Viewed