UAE KING సిటిజన్ షిప్ ఆఫర్.. అర్హులు వీరే!

by  |
UAE KING సిటిజన్ షిప్ ఆఫర్.. అర్హులు వీరే!
X

దిశ, వెబ్‌డెస్క్ : యునైటైడ్ అరబ్ ఎమిరెట్స్ (UAE) పేరు చెబితే ముందుగా అందరికీ గుర్తొచ్చిది ఆయిల్. ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున క్రూడాయిల్ ఎగుమతి అవుతుంటుంది. వరల్డ్ వైడ్ సరఫరా అయ్యే ఆయిల్‌లో 2/3వ వంతు ఈ ఏడారి కంట్రీస్ నుంచే ఉండటం గమనార్హం. తొలుత ఆయిల్ ఎగుమతులపైనే ఆధారపడిన గల్ఫ్ దేశాలు ప్రస్తుతం టూరిజం, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లాజిస్టిక్స్ ఎగుమతి తదితర రంగాలపై ముఖ్యంగా ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం యుఏఈ జీడీపీలో ఈ రంగాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయి.

ల్యాండ్ విస్తీర్ణం పరంగా ఎక్కువగా భాగం ఎడారిని కలిగియుండే ఈ దేశంలో ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ మధ్యలో ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ దుబాయ్ ‘బుర్జ్ ఖలీఫా’తో పాటు సముద్రంలో ‘నివాస ప్లాట్ల’ను నిర్మించి ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశారు. అలాంటిది అభివృద్ధిలో ఎమిరేట్స్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు ‘యుఏఈ కింగ్ షేక్ సల్మాన్ బిన్ రషిద్ అల్ మక్తూమ్’ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా వలే తమ దేశంలోనూ సిటిజన్ షిప్ (యుఏఈ పౌరసత్వం) ఇవ్వనున్నట్లు రాజు సల్మాన్ ప్రకటించారు. అయితే, ప్రపంచంలోనే నేరాలకు అతి కఠినమైన శిక్షలు విధించే గల్ఫ్ కంట్రీలో సిటిజన్ షిప్ కార్డులు పొందడం అంటే మాములు విషయం కాదు. ఆ దేశ పౌరులు కావాల్సిన వారు UAE నిబంధనలన్నింటీని ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాధారణ పౌరులకు కూడా అక్కడ సిటిజన్ షిప్ దొరకడం చాలా కష్టం.. UAE పౌరస్వతం పొందాలనుకునే వారి జాబితాను కింగ్ సల్మాన్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ( పెట్టుబడిదారులు, స్పెషలైజ్డ్ టాలెంటర్స్, ఫ్రొఫెషనల్స్, సైంటిస్ట్స్, డాక్టర్స్, ఇన్వెంటర్స్ ఇంజినీర్స్, ఆర్టిస్ట్స్, ఆథర్స్) మొదలగు విభాగాలకు చెందిన వారున్నారు. దీనికోసం అక్కడి చట్టాలకు సవరణలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే, UAE కిందకు వచ్చే దుబాయ్, అబుదాబిలో 80 శాతం ఇతర దేశాలకు చెందిన పౌరులే ఆ దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టాలకు కొత్తగా చేసిన సవరణల ప్రకారం పౌరుల టాలెంట్‌ను గుర్తించి వారికి పౌరసత్వం ఇవ్వనున్నారు.

ఒరిజినల్ పౌరసత్వం ఉంటుందా?
యుఏఈలో పౌరసత్వం పొందిన వారికి ప్రస్తుతమున్న( ఇతర దేశాల) పౌరసత్వం అలాగే ఉంటుంది.

ప్రస్తుతం అక్కడే ఉంటున్న వారికి ఇస్తారా?

ఎమిరేట్స్‌లో ప్రస్తుతముంటున్న విదేశీయులు పౌరసత్వం పొందాలంటే ఆ దేశ పాలకులు, రాజులు, కోర్టులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, కేబినెట్ మరియు ఫెడరల్ వ్యవస్థల నామినేషన్స్ ద్వారా పొందవచ్చునని సమాచారం.

UAE పౌరసత్వంతో లాభమెంటీ?
యుఏఈ సిటిజన్ షిప్ పొందిన వారికి పెద్ద మొత్తంలో లాభాలు చేకూరనున్నాయి. యుఏఈలోని వ్యాపార, ఆస్తులపై అక్కడి పౌరులకు వర్తించే బెనిఫిట్స్ పొందగలరు.

సిటిజన్ ఎలా వస్తుందంటే?

*ఇన్వెస్టర్స్ : యుఏఈలో వీరికి సొంత ప్రాపర్టీ ఉండాలి.
*డాక్టర్స్ మరియు స్పెషలిస్ట్స్ : అరబ్ దేశాల్లో ఎక్కువగా అవసరమునర్న ప్రత్యేక నిపుణులు, అరుదైన శాస్త్రీయత కల్గిన వ్యక్తులు, వైద్య నిపుణులకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది.
*శాస్త్రవేత్తలు : ప్రయివేటు రంగానికి చెందిన యూనివర్సిటీ లేదా రీసెర్చ్ సెంటర్‌లో 10ఏళ్లకు మించిన అనుభవం, ప్రస్తుతం కూడా పనిచేస్తున్న సైంటిస్టులకు ప్రాధాన్యత ఉంటుంది.
*ఇన్వెంటర్స్ : ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త ఆవిష్కరణలు చేసి యుఏఈ మంత్రిత్వశాఖ లేదా రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ బాడీ నుంచి పేటెంట్ రైట్స్ కలిగి ఉండాలి. దాంతో పాటు ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి శాఖ నుంచి రికమండేషన్ లెటర్ కల్గిఉండాలి.

Next Story

Most Viewed