కరోనా ఆసుపత్రిగా కింగ్ కోఠి అప్‌గ్రేడ్

by  |
కరోనా ఆసుపత్రిగా కింగ్ కోఠి అప్‌గ్రేడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కరాళా నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స అందిస్తున్న కింగ్‌ కోఠి దవాఖానను ప్రభుత్వం.. పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చింది. గాంధీలో ఇప్పటికే 2వేల పడకల సామర్థ్యం ఉండగా, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో 120 పడకలు ఉన్నాయి. ఇటీవలే గచ్చిబౌలిలో 1500 పడకల సామర్థ్యం ఉన్న టిమ్స్‌ వైద్యశాలను అందుబాటులోకి తెచ్చారు. అక్కడ 40 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed