రామానాయుడి అరెస్టును ఖండించిన నాని

by  |
రామానాయుడి అరెస్టును ఖండించిన నాని
X

ఆక్వారైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు సైకిల్‌పై పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి ఏలూరుకు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును భీమవరం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా..

మంత్రుల దగ్గర నుంచి వార్డు సభ్యుల వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాలని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే పిలుపునిచ్చిన సంగతిని గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకని ఒక్కడినే సైకిల్‌పై వస్తుంటే పోలీసులు అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి ఉన్న ఆంక్షల నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ వస్తున్న తనపై పోలీసులు కేసు పెట్టడం చాలా అన్యాయమని, ఓ ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన గుర్తు చేశారు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం తాను ఎన్ని ఇబ్బందులు పడేందుకైనా సిద్ధమేనని చెప్పారు. దీనిపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రామానాయుడిని అరెస్టు చేయడం అన్యాయమని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్ మాధ్యమంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, పోలీసు శాఖను కోరారు.

Tags: tdp mp, kesineni nani, nimmala ramanaidu, tdp, ap, west godavari, palakollu, eluru

Next Story

Most Viewed