కేరళ విద్యాశాఖ మంత్రికి షాక్.. బంధుప్రీతి ఆరోపణలతో రాజీనామా

by  |
కేరళ విద్యాశాఖ మంత్రికి షాక్.. బంధుప్రీతి ఆరోపణలతో రాజీనామా
X

తిరువనంతపురం: ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొద్దిరోజుల ముందుగానే కేరళ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.టి.జలిల్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలతో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగారు. మంత్రిగా ఉండి తన బంధువులకు ఉన్నత పదవులు కట్టబెట్టి ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన లోకాయుక్త.. ఆయన పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని తెలిపింది.

ఈ మేరకు జలీల్‌పై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు పంపించింది. కాగా, లోకాయుక్త ఆర్డర్లపై స్టే విధించాలని జలీల్ సోమవారం హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేశారు. తన ఫేస్బుక్ పోస్టులో కూడా ఈ విషయాన్ని తెలిపారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. జలీల్‌కు బంధువైన అదీబ్‌కు కేరళ స్టేట్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ పోస్టును కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి.



Next Story

Most Viewed