శబరిమల యాత్రకు ఓకే.. కానీ…

by  |
శబరిమల యాత్రకు ఓకే.. కానీ…
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ సర్కారు ఓ ప్రకటన చేసింది. ఈ సంవత్సరం శబరిమల యాత్రకు భక్తులు వచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే, దర్శనాల సమయంలో కరోనా నిబంధనలను అనుసరించాలని పేర్కొన్నది. నవంబర్ 16 నుంచి శబరిమల యాత్ర ప్రారంభం కానున్నది.

ఈ యాత్రకు వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని తెలిపింది. అది కూడా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే పరీక్షలు చేయించుకుంటేనే అనుమతుంటుందని స్పష్టం చేసింది. అదేవిధంగా యాత్ర సమయంలో దేవాలయం వద్ద కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని, ఏర్పాట్లు నిబంధనలకు లోబడే చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సేవల నిమిత్తం ఒక హెలికాఫ్టర్ ను కూడా సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Next Story

Most Viewed