ఆ ఇంటి కరెంటు బిల్లు రూ. 150 మాత్రమే!

by  |
ఆ ఇంటి కరెంటు బిల్లు రూ. 150 మాత్రమే!
X

దిశ, వెబ్‌డెస్క్:

కేరళ రాష్ట్రం, కొచ్చిలోని ఎళాంకుళంలో నివసించే లీనా, రవి జార్జ్‌ల ఇంటి కరెంటు బిల్లు నెలకు కేవలం రూ. 150 మాత్రమే. అలాగని వీళ్లు లైట్లు లేకుండా అంధకారంలో బతుకుతున్నారని మాత్రం అనుకోవద్దు. చూడగానే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే పూల చెట్లతో వాళ్ల ఇల్లు నిండి ఉంటుంది. అప్పుడే కొద్దిగా తల ఎత్తి ఇంటి టెర్రస్ మీద చూస్తే అసలు విషయం తెలిసి పోతుంది. 24 సోలార్ ప్యానెళ్లు ఆ టెర్రస్ మీద కనిపిస్తాయి. వీటి సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసుకుని ఒకప్పుడు నెలకు రూ. 6000 వచ్చే కరెంటు బిల్లును ఇప్పుడు రూ. 150కి తగ్గించారు.

కేవలం కరెంటు బిల్లు విషయంలోనే కాదు.. ఇంటిని అందంగా డెకరేట్ చేసి, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నట్లుగా ఉండేలా వీరు ఇంటిని తీర్చిదిద్దారు. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న లీనా ఈ ఇంట్లో ప్రతి అంగుళాన్ని ప్రకృతి సహితంగా మార్చింది. ఇప్పుడు కొచ్చిలో వీరి ఇల్లు ఒక మోడల్ సస్టైనబుల్ ఇంటికి పేరుగాంచింది. 2014లో సోలార్ విద్యుత్ అమర్చిన తర్వాత చాలా డబ్బు సేవ్ అయిందని లీనా అంటున్నారు. మొదట్లో బ్యాటరీ ఆధారిత సోలార్ జనరేటర్‌లో కొన్ని లోపాలు ఉండటంతో మూడేళ్ల క్రితం గ్రిడ్ ఆధారిత సోలార్ ఫిట్టింగ్ చేయించినట్లు రవి తెలిపారు. ఒక్క సోలార్ విద్యుత్ వాడకం విషయంలోనే కాకుండా జీవఇంధనం వాడటంలో, ఆర్గానిక్ గార్డెన్ నిర్మించడంలో కూడా ఈ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు



Next Story

Most Viewed