చిరుకు చెల్లిగా కీర్తి?

49

దిశ, వెబ్ డెస్క్:
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. ఒకటి మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కాగా, మరొకటి వేదాలమ్. ఈ చిత్రం డైరెక్ట్ చేసే చాన్స్ మెహర్ రమేష్ కొట్టేయగా .. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. అయితే, మెగాస్టార్ కు సోదరి పాత్ర సినిమాలో కీలకం కాగా, సాయి పల్లవి ఈ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన స్థానంలో కీర్తి సురేష్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండడంతో ఈ క్యారెక్టర్ పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారట డైరెక్టర్. కానీ కీర్తి, సాయి పల్లవి ఎవరైనా పాత్రకు న్యాయం చేస్తారనే విషయం అర్థం అవుతుండగా.. ఎవరు ఫైనల్ అయ్యారనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.