పోటెత్తిన వరద.. తెరుచుకున్న కౌలాస్ గేట్

by  |
Kaulas Nala Project
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి 450.00 (1.18 టీఎంసీ ) మీటర్ల నీటిమట్టం చేరుకుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రాజెక్ట్ గేటును ఓపెన్ చేసి 75 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బుధవారం తెల్లవారే సరికి నీటిమట్టం క్రమంగా పెరగడంతో గేటును మరికొంత ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 457.80 (1.23 టీఎంసీ) మీటర్లు. వరద నీటిరాక పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. గేట్లు ఎత్తుతున్నందున కౌలాస్ నాలా, మంజీరా తీర ప్రాంత గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌలాస్ నాలా నీటి పారుదల శాఖ డీఈ దత్తాత్రి హెచ్చరించారు.

Next Story

Most Viewed