పద్మాసనంలో స్విమ్మింగ్

by  |
పద్మాసనంలో స్విమ్మింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించేందుకు ఓ స్కూల్ టీచర్ వినూత్న ఫీట్ చేశాడు. యోగాసనంలో ఈత కొట్టి రికార్డు సృష్టించాలని ప్రయత్నించాడు. కర్నాటక‌లోని ఉడిపి జిల్లాకు చెందిన నాగరాజ్ ఖర్వి.. కల్మంజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. అంతేకాదు ఈయన జాతీయ స్థాయి స్విమ్మర్ కూడా. గుజరాత్, వడోదరలో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో బంగారు, వెండి పతకాలను సైతం గెలుచుకున్నాడు. 25.16 నిమిషాలలో కిలోమీటరు దూరం స్విమ్మింగ్ చేసిన రికార్డు ఆయన సొంతం. అయితే తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినప్పటికీ తన పేరు రికార్డుల్లోకి ఎక్కలేదని భావించిన నాగరాజ్.. ఓ డిఫరెంట్ ఫీట్‌తో రికార్డు క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు పద్మాసనంలో ఈత కొట్టి రికార్డు కోసం ప్రయత్నిస్తానని దక్షిణ కన్నడ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ప్రదీప్ డిసోజకు తెలిపాడు. ఆయన సమక్షంలో మంగళూరులోని తన్నీర్‌బావి వద్ద అరేబియా సముద్ర తీరాన పద్మాసనంలో ఒక కిలోమీటరు దూరం ఈత కొట్టాడు. పద్మాసనం అంటే స్విమ్మింగ్, యోగా కాంబినేషన్ అని, తన పేరు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో ఎక్కడం కోసమే తాను ఈ ఫీట్ చేశానని నాగరాజ్ ఖర్వి తెలిపాడు. కాగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ఈ ఫీట్ గురించి తెలియజేస్తామని, వారు పరిశీలించిన మీదట నిర్ణయం తీసుకుంటారని స్పోర్ట్స్ ఆఫీసర్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed