దర్శకేంద్రుడి 30 ఏళ్ల మధుర స్మృతులు

by  |
దర్శకేంద్రుడి 30 ఏళ్ల మధుర స్మృతులు
X

మే 9..ఇదే రోజు.. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం.. చలన చిత్ర ఆకాశంలో అద్భుత మెరుపు మెరిసి.. వెండితెరపై అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిపోయింది. అదే.. దర్శకేంద్రుడి 70వ చిత్రం .. జగదేకవీరుడు అతిలోక సుందరి.వరుస ఫెల్యూర్స్ తో ఉన్న రాఘవేంద్ర రావు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించి .. సత్తా చాటిన సినిమా. సుందర దృశ్య కావ్యంగా నిలిచి.. ప్రేక్షకుల మదిని దోచిన చిత్ర అలనాటి మధుర స్మృతులను ప్రేక్షకులతో పంచుకున్నాడు రాఘవేంద్రుడు.

హిట్ లేక సతమతం అవుతున్న సమయంలో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం తెరకెక్కించే సత్తా కేవలం రాఘవేంద్రరావు కు మాత్రమే ఉందని నమ్మిన నిర్మాత అశ్వినీదత్, మెగాస్టార్ చిరంజీవికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. చిరు, శ్రీదేవి లేకపోతే సినిమా లేదన్న దర్శకేంద్రుడు.. సాహిత్యం, మ్యూజిక్ అందించిన వేటూరి, ఇళయరాజా కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం కోసం ఒక్కరూ అద్భుతంగా పనిచేశారన్న ఆయన.. ఫోటోగ్రాఫర్ విన్సెంట్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు. గ్రాఫిక్ మాయాజాలంతో అబ్బురపరిచారని కితాబిచ్చారు.

సినిమాలో ఇంద్రజకు ఉంగరం దొరికాక దేవలోకానికి వెళ్లే అద్భుతమైన సీన్.. ఎలాంటి గ్రాఫిక్ షాట్స్ లేకుండా కేవలం మిని సెట్ లో తీసినట్లు చెప్పారు. ఉంగరం చేతికి దరించగానే.. ఇళ్లు పై కప్పు తెరుచుకోవడం.. ఒకేసారి వెలుగులు విరజిమ్మడం అత్యంత అద్భుతమైన దృశ్యమన్నారు. చావే లేకుండా ఉండే దేవకన్య కన్నా .. చావు ఉన్నా ఇంత ప్రేమ పొందే మానవ జన్మ చాలని ..నేను ఇక ఇంద్రలోకంలోకి వెళ్లను అని.. శ్రీదేవి ఉంగరం తీసి పడేసినప్పుడు.. చేప నోట్లోకి ఉంగరం వెళ్లే షాట్ అద్భుతంగా మలిచారని కీర్తించారు.

దేవత భూలోకానికి వచ్చినప్పుడు.. అందాలలో అహో మహోదయం పాట చిత్రీకరణకు వాహిని స్టూడియో లో ఆర్ట్ డైరెక్టర్ వేసిన్ సెట్.. ఫోటోగ్రాఫర్ చూపిన పనితనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అన్నారు. ఈ పాటను కేవలం 10 రోజుల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. అబ్బనీ తీయని పాట కొరియోగ్రఫీ చేసేందుకు సుందరం మాస్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పాటకు ప్రభుదేవా నృత్య దర్శకత్వం వహించి.. ఈ సినిమా తోనే కెరియర్ స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు దర్శకేంద్రుడు.

ఆ కల నెరవేరలేదు..

అతిలోక సుందరి శ్రీదేవి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారట రాఘవేంద్ర రావు. అప్పుడు తనను ఎత్తుకుని సెట్లలో తిరిగే వాడినని.. తనను హీరోయిన్ గా తెరపై చూడడం చాలా ఆనందంగా ఉండేదన్నారు. మామ్ చిత్రం తనకు చివరి సినిమా కాగా.. ఆ ఆడియో ఫంక్షన్ లో తనతో మనం ఇప్పటి వరకు 24 సినిమాలు చేశాం.. 25వ సినిమా తప్పకుండా చేయాలి అనుకున్నాం. కానీ ఆ కల నెరవేరాకుండానే తను ఆ దేవలోకానికి వెళ్లిపోవడం అనేది బాధించే విషయం అన్నారు దర్శకేంద్రుడు. అయితే చిరు, శ్రీదేవి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని విషయం అంటూ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.



Next Story

Most Viewed