‘కోహ్లీ నిర్ణయం సరైనదే’

by  |
‘కోహ్లీ నిర్ణయం సరైనదే’
X

దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ పర్యటన కోసం టీమ్ ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నది. వన్డేలు, టీ20లతో పాటు నాలుగు టెస్టులు ఆడనున్నది. కాగా, అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టు అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ భార్య అనుష్క తొలి సంతానిన్ని ప్రసవించే అవకాశం ఉండటంతో కోహ్లీ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై భారతీయ అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థించాడు. ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీనే నెంబర్ వన్. అతడి ఆటతీరు నమ్మశక్యంకానివిధంగా ఉంటుంది. అయితే తొలి సారిగా తండ్రి కాబోతున్న విరాట్.. ఆ మాధుర్యమైన క్షణాలను అనుభవించడానికి ఇండియాకు తిరిగి వెళ్లాలనే నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నాను. ఏ క్రికెటర్‌కి అయినా తాను ఇదే సలహా ఇస్తాను. సంతానం కలిగే సమయంలో భార్య పక్కన ఉండమని చెబుతాను’ అని అన్నాడు.


Next Story