ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ 

by  |
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ 
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: వరదలు అంతకంతకూ పెరిగి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతుంది. నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు లోతట్టు ప్రాంతాల అధికారులను అప్రమతం చేసి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్‌లోకి 5,47,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 49 గేట్లను ఎత్తి 6,03,468 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 62 గేట్లు తెరచి 7 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలే అంచనాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 2009 తరువాత ఇది స్థాయిలో వరద నీరు వచ్చి చేరడం ఇదే మొదటిసారి.

కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణానది తీర పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే స్థానిక సర్పంచులు, అధికారులు తమ గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలైన క్యాతూరు, భీమవరం, ఊట్కూరు, గుందిమళ్ల, భైరంపల్లి, అలంపురం, సుల్తాన్‌పురం, శింగవరం, జిల్లెలపాడు తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నదితీరం వెంటవున్నందున శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరిగే అవకాశం ఉందని సూచనలు చేశారు.


Next Story

Most Viewed