వాహనదారులకు కేంద్రం బంపర్ ఆఫర్

76

దిశ వెబ్‌డెస్క్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాత వాహనాలను అప్పగించి కొత్త వాహనాలను కొనుగోలు ఇస్తే ఆటోమొబైల్ సంస్థలు 5 శాతం రాయితీ ఇస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ విధివిధానాల గురించి తాజాగా గడ్కరీ వివరించారు.

పాత కారును తుక్కుగా వదిలేస్తే కొత్త కారుపై 5 శాతం డిస్కౌంట్‌తో పాటు గ్రీన్ టాక్స్ ఉండదని నితిన్ గడ్కరీ తెలిపారు. పాత కార్లపై ఉండే పొల్యూషన్ ఛార్జీల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్లను నెలకొల్పే అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు.

కొత్త పాలసీ ప్రకారం 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్లు పైబడిన కమర్షియల్ వాహనాలు తప్పనిసరిగా ఫిట్‌నెస్ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆటోమేటెడ్ టెస్ట్‌ల్లో విఫలమైన వెహికల్స్‌పై భారీ జరిమానాలు విధిస్తామని గడ్కరీ చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..