ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కోసం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్.. కోట్ల పెట్టుబడులు!

by  |
steel
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తన స్టీల్, సిమెంట్, పెయింట్ ఉత్పత్తులను ఒకే దగ్గర విక్రయించే ‘జేఎస్‌డబ్ల్యూ వన్’ ఈ-కామర్స్ స్టోర్‌ను ప్రారంభించేందుకు రూ. 250 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను మరింత సులభంగా అందించేందుకు రూపొందించామని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా ఇది వినియోగదారుల కోసమే కాకుండా వ్యాపార అవసరాల కోసం కూడా సేవలందిస్తుందని కంపెనీ పేర్కొంది. వ్యాపార వర్గాల కోసం ప్రత్యేకంగా జేఎస్‌డబ్ల్యూ వన్ ఎంఎస్ఎంఈని ఏర్పాటు చేస్తోంది.

ఇది చిన్న, మధ్య తరహా తయారీదారులు, కాంట్రాక్టర్ల కోసం ఆన్‌లైన్ లావాదేవీలు, ఆర్డర్లను సులభతరం చేస్తుంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ కార్యకలాపాలను తమిళనాడులో ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. 2023 నాటికి దేశవ్యాప్తంగా సంస్థ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా ఉంది.

వ్యక్తిగత గృహ నిర్మాణాలకు సంబంధించిన పరికరాలను అందించేందుకు కూడా జేఎస్‌డబ్ల్యూ వన్ హోమ్స్ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. జేఎస్‌డబ్ల్యూ వన్ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం స్టీల్ ఉత్పత్తులను అందిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సిమెంట్, పెయింట్ ఉత్పత్తులను కూడా ప్రారంభించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed