2022 లో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ: జె పి మోర్గాన్

429
jp

దిశ, వెబ్‌డెస్క్: 2022లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణ కనిపిస్తుందని అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెపి మోర్గాన్ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయింది. కరోనాకు మందులు కనిపెట్టడం, చికిత్సా విధానాలు మెరుగుపడడం వలన ఇప్పుడిప్పుడే ప్రపంచం కరోనా ముందు స్థితికి వస్తుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గనప్పటికి కీలక రంగాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రపంచ మార్కెట్లు కూడా కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. 2022 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని జె పి మోర్గాన్ తెలిపింది.