అయోధ్యపై వివాదాస్పద ట్వీట్.. జర్నలిస్టు అరెస్టు

by  |
అయోధ్యపై వివాదాస్పద ట్వీట్.. జర్నలిస్టు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామ జన్మభూమిలో రామమందిరం నిర్మాణానికి సంబంధించి ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 5న భూమి నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఆలయ నిర్మాణంపై ప్రశాంత్ కన్హోజీ అనే జర్నలిస్టు ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో ఆయన్ను యూపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అయోధ్య రామమందిరానికి సంబంధించి ఓ మార్ఫింగ్ చేసిన ఫొటోను జర్నలిస్టు పోస్టు చేశాడని, అందువల్లే అతడిని అదుపులోనికి తీసుకున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం కన్హోజిని వసంత్ విహార్ పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన అనంతరం లక్నోకు తీసుకువెళ్లనున్నట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉంటే, గతంలో కూడా కన్హోజీ ఇలాంటి వివాదాస్పద ట్వీట్‌లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కూడా వివాదాస్పద ట్వీట్ చేసినందున అతడిని అరెస్టు చేసినట్లు స్పష్టంచేశారు.



Next Story

Most Viewed