UGC-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ - 2022

by Disha Web Desk 17 |
UGC-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ - 2022
X

దిశ, ఎడ్యుకేషన్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహిస్తున్నట్లు యూజీసీ వెల్లడించింది. ప్రతి ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు.

వివరాలు :

యూజీసీ నెట్ - 2022

సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ తో పాటు ఇతర సబ్జెక్టులుంటాయి.

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జేఆర్ఎఫ్‌కు ఫిబ్రవరి 1, 2023 నాటికి 30 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు: ఆన్‌లైన్ లో చేయాలి.

చివరి తేదీ: జనవరి 17, 2023

పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 21, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in/


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story