NILD కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023

by Disha Web Desk 17 |
NILD కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
X

దిశ, కెరీర్: 2023 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ ఈ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

యూజీ కోర్సులు:

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)

బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ)

బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 (సైన్స్ సబ్జెక్టులు/మ్యాథ్స్) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుంది.

వయసు: కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 800 ఉంటుంది.

ఇతర కేటగిరి వారికి రూ. 1000 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరి తేదీ: జూన్ 12, 2023

ప్రవేశ పరీక్ష తేదీ: జులై 9, 2023.

ఫలితాలు: జులై 17, 2023.

వెబ్‌సైట్: http://svnirtar.nic.in/

Next Story

Most Viewed