ప్రాణవాయువు వెంటతెచ్చి.. ప్రాణం నిలిపిన స్నేహితుడు

by  |
ప్రాణవాయువు వెంటతెచ్చి.. ప్రాణం నిలిపిన స్నేహితుడు
X

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తుండగా, ఆక్సిజన్ అందక వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారినపడ్డ తన స్నేహితుడికి ఆక్సిజన్ అందించేందుకు ఓ వ్యక్తి ఒకే రోజున 1,300 కిలోమీటర్లు పయనించాడు. ఎట్టకేలకు తన మిత్రుడికి ప్రాణవాయువు అందించి ప్రాణాలు కాపాడగలిగాడు. స్నేహం గొప్పతనాన్ని చాటిన ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..

జార్ఖండ్‌లోని రాంచికి చెందిన దేవేంద్ర కుమార్ శర్మ, యూపీ ఘజియాబాద్‌కు చెందిన సంజయ్ శర్మ, రాజన్ ముగ్గురు మంచి స్నేహితులు. రాజన్‌కు ఇటీవలే కరోనా సోకగా, ట్రీట్మెంట్ నిమిత్తం ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే రాజన్ హెల్త్ కండిషన్ సీరియస్‌గా మారడంతో డాక్టర్లు వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు లేవని, షార్టేజ్ ఉందని వైద్యులు తెలపడంతో ఆందోళన చెందిన స్నేహితుడు సంజయ్ శర్మ.. వెంటనే ఈ విషయాన్ని రాంచీలో ఉన్న మరో స్నేహితుడు దేవేంద్ర కుమార్ శర్మకు చేరవేసి, ఎలాగైనా ఆక్సిజన్ సిలిండర్ అందించాలని కోరాడు.

ఈ మేరకు ఆక్సిజన్ సిలిండర్ల కోసం సెర్చ్ స్టార్ట్ చేసిన దేవేంద్ర.. రాంచీ నుంచి బొకారోకు బైక్‌పై వెళ్లి అక్కడ ఆక్సిజన్ సిలిండర్లను తీసుకున్నాడు. ఇక అక్కడ నుంచి కారులో దాదాపు 1,300 కిలోమీటర్లను ఒకేరోజులో ప్రయాణించి ఘజియాబాద్ ఆస్పత్రిలో ఉన్న తన స్నేహితుడికి ఆక్సిజన్‌ అందజేసి ప్రాణాలు కాపాడాడు. మార్గ మధ్యలో పోలీసులు తనిఖీ చేసినప్పుడు తన స్నేహితుడు క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడని, దయచేసి అనుమతించాలని పోలీసులను వేడుకున్నానని వారి సహకారంతోనే తన మిత్రుడి ప్రాణాలు నిలుపుకున్నానని దేవేంద్ర తెలిపాడు.



Next Story

Most Viewed