జపాన్‌లో క్రెడిట్ కార్డు నెంబర్‌ల కొరత!

by  |
జపాన్‌లో క్రెడిట్ కార్డు నెంబర్‌ల కొరత!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో జనాభా పెరుగుతోందనడానికి జనాభా లెక్కలు నిదర్శనమైతే, డబ్బు వాడకం.. నగదు చెల్లింపు నుంచి నగదు రహిత చెల్లింపులకు మారిపోతోందనడానికి జపాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అద్దం పడుతోంది. అవును.. జపాన్‌లో ఇప్పుడు క్రెడిట్ కార్డులకు నెంబర్ల కొరత ఏర్పడింది. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నవారికి కొత్తగా ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడానికి ఇప్పుడు నెంబర్‌లు లేవు. అక్కడ నగదు రహిత చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు కొవిడ్ పరిస్థితుల కారణంగా అందరూ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు క్రెడిట్ కార్డులు లేని వారు సైతం కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

వీసా, మాస్టర్‌కార్డ్, జేసీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు జపాన్‌లోని క్రెడిట్ సంస్థలతో సమన్వయంగా 16 అంకెలు గల క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. వీటిలో మొదటి 6 నెంబర్లు అంతర్జాతీయ సంస్థల చేతుల్లో ఉంటాయి. వీటిలో దేశం, బ్రాండ్, కార్డు ఇచ్చేవారి రకం వంటి వాటికి సంబంధించిన నెంబర్లు ఉంటాయి. ఇక మిగతా పది నెంబర్‌లు మాత్రమే జపాన్ సంస్థల చేతుల్లో ఉంటాయి. వీటిలో ఖాతా నెంబర్, సభ్యత్వానికి సంబంధించిన నెంబర్‌లు ఉంటాయి. మార్చి 2019 వరకు అక్కడ 283 మిలియన్‌ల క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. అలాగే వీటి సంఖ్య ప్రతి ఏడాది 2 శాతం పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ఈ కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడు నెంబర్ల సంఖ్య పెంచవచ్చు గానీ, ఇప్పటి వరకు ఇచ్చిన నెంబర్ల వ్యవస్థను మార్చాల్సి వస్తుంది లేదా పునరావృతమయ్యే నెంబర్ల కారణంగా క్రెడిట్ కార్డు ఫ్రాడ్‌లు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుందా అని జపాన్ ఆర్థిక, వాణిజ్య వేత్తలు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed