ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘జల్లికట్టు’.. ఆశలన్నీ ‘బిట్టు’పైనే!

by  |
ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘జల్లికట్టు’.. ఆశలన్నీ ‘బిట్టు’పైనే!
X

దిశ, సినిమా: విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ 93వ ఆస్కార్ అవార్డు రేసులో అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన ఈ సినిమా ఆస్కార్ అకాడమీ తాజాగా రిలీజ్ చేసిన 15 సినిమాల షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించలేక పోయింది. దీంతో ‘జల్లికట్టు’ రేస్‌ నుంచి తప్పుకున్నట్లే కాగా, ప్రస్తుతం షార్ట్ లిస్ట్‌లో ఉన్న 15 సినిమాలు ఫైనల్ నామినేషన్స్ కోసం పోటీపడబోతున్నాయి. కాగా ఈ లిస్ట్‌ను మార్చి 15న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇండియా నుంచి టాప్ 10 బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘బిట్టు’ చోటు సంపాదించడం విశేషం. కరిష్మా దేవ్ దూబె డైరెక్షన్‌లో వచ్చిన ‘బిట్టు’ ఆస్కార్ అవార్డుకు చేరువలో ఉండగా.. చివరి ఐదు నామినేషన్లలో స్థానం కోసం పోటీపడుతోంది. ఇక సూర్య నటించిన ‘సురారైపోట్రు’ కూడా పలు కేటగిరీల్లో పోటీపడుతోంది. ఇక హాలీవుడ్ ఫిల్మ్ ‘టెనెట్’ బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించింది.

Next Story

Most Viewed