- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శిల్పాశెట్టి, ప్రణీతల ‘హంగామా’ షురూ
దిశ, వెబ్‌డెస్క్ :
కామెడీ చిత్రాలు తీయడంలో దర్శకుడు ప్రియదర్శన్‌ది అందెవేసిన చెయ్యి. 1984లో తాను తీసిన ‘పూచక్కోరు మూక్కుతి’ అనే సినిమా ఆధారంగా 2003లో ‘హంగామా’ అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, పరేష్ రావల్, రిమ్మిసేన్, అఫ్తాబ్ శివ్‌దసాని ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత.. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన ప్రియదర్శన్.. కామెడీ ప్రధానంగా ‘హంగామా-2’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభంకాగా, ఇందుకోసం శిల్ప, ప్రణీతలు ప్రైవేట్ జెట్‌లో షూటింగ్ స్పాట్‌కు బయలుదేరారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ‘హంగామా-2’ చిత్ర షూటింగ్ ఇన్నాళ్లూ వాయిదా పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ఇందుకోసం.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, నటి ప్రణీత సుభాష్, పరేష్ రావల్, మీజాన్‌లు మనాలీకి ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని శిల్పాశెట్టి తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. ‘కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, మేము టేకాఫ్ అవుతున్నాం, ఇది హంగామా టైమ్’ అంటూ పేర్కొంది. వీళ్లంతా ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మనాలీ బయలుదేరే ముందు.. దిగిన ఫొటోలను తన పోస్ట్‌కు జతచేసింది. మరో 12 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న ఈ చిత్రాన్ని రతన్ జైన్, గణేష్ జైన్, చేతన్ జైన్, అర్మాన్ వెంచర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
https://www.instagram.com/p/CF6jwThBf2Q/?utm_source=ig_embed