పిల్లలు వీడియోగేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారా?

by  |
పిల్లలు వీడియోగేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్‌తో పాఠశాలలన్నీ బంద్ అయ్యాయి. హోం వర్క్ లేదు, పరీక్షలు లేవు. పిల్లలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. బయటకెళ్లి ఆడుకునేందుకూ వీల్లేదు. దాంతో టైమ్‌పాస్ కోసం చిన్నారులంతా మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. క్రమేణా అది వారికి అడిక్షన్‌లా మారిందని చాలామంది తల్లిదండ్రులు డాక్టర్లకు కంప్లయింట్ చేస్తున్నారు. మొబైల్ ఇవ్వకపోయినా, గేమ్ ఆడొద్దని హెచ్చరించినా.. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఆ అడిక్షన్ నుంచి వారినెలా తప్పించాలి?

వీడియోగేమ్స్ మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. కానీ, అవి పిల్లల గ్రాస్పింగ్ పవర్‌ను తగ్గించడంతో పాటు లిజెనింగ్ స్కిల్స్‌పైనా ప్రభావం చూపుతాయి. ఎక్సెసివ్ గేమింగ్.. పిల్లల్లో ఆందోళన కూడా పెంచుతుందని, సోషల్ ఫోబియాను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పిల్లలతో గేమ్స్ పూర్తిగా మాన్పించాల్సిన అవసరం లేదు, వాటికి కాస్త టైమ్ కేటాయిస్తూ.. మిగతా వాటిపై (ఇండోర్/ఔట్ డోర్ యాక్టివిటీస్)నా దృష్టిసారించేలా చేయాలి. ముఖ్యమైన విషయమేంటంటే.. లాక్‌డౌన్‌లోనే ఇలా అడిక్ట్ అయ్యారా? ఇంతకుముందు కూడా గేమింగ్స్ పై ఎక్కువ టైమ్ కేటాయించేవారా ? అన్నది పేరెంట్స్ గమనించాలి. ఏదేమైనా వారిని స్నేహితులతో ఎక్కువగా కలవనీయాలి, సోషల్ యాక్టివిటీస్‌లో భాగం చేయాలి.

– ప్రతిరోజు ఇండోర్ యాక్టివిటీస్‌లో భాగం చేయాలి. బోర్డ్ గేమ్స్ ఆడించడం, సంగీతం వినిపించడంతోపాటు మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయించాలి, న్యూట్రిషనల్ కుకింగ్ చేయించాలి.
– ఇంట్లో ఆడే గేమ్స్‌లో పార్టిసిపేట్స్ చేస్తే.. రివార్డ్ అందించాలి.
– ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలి. దీంతోపాటు రన్నింగ్, స్కిప్పింగ్ చేసేలా ప్రోత్సహించాలి.
– సృజనాత్మకతను వెలికితీసేలా పనికిరాని వస్తువులతో పనికొచ్చే క్రాఫ్ట్స్ తయారు చేసేలా ఎంకరేజ్ చేయాలి.
– ఇంట్లో చేసే చిన్న చిన్న ప్రయోగాలను చేసి చూపించాలి. అందులో వారిని ఇన్వాల్వ్ చేయించాలి.
– పుట్టిన రోజులకు, ఇతర స్పెషల్ డేస్‌కు బహుమతులు తయారు చేయించాలి.
– పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేయించాలి.
– నీతికథలు లేదా మంచి పుస్తకాలు చదివించాలి
– స్నేహితులు, బంధువులతో డిస్కషన్లలో పాల్గొనేలా చేయాలి. ఆ సమయంలో వారి ఫీలింగ్స్, ఎమోషన్స్‌ను అబ్జర్వ్ చేయాలి.
– ఎన్ని చేసినా.. అవుట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉంటే మాత్రం థెరపిస్ట్‌ను సంప్రదించాల్సిందే.


Next Story

Most Viewed