నగదు, నగదు రహిత పాలసీల మధ్య వివక్ష ఉండొద్దన్న ఐఆర్‌డీఏఐ

by  |
నగదు, నగదు రహిత పాలసీల మధ్య వివక్ష ఉండొద్దన్న ఐఆర్‌డీఏఐ
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కేసులకు సంబంధించి చికిత్స విషయంలో నగదు, నగదు రహిత పాలసీలు కలిగిన వినియోగదారుల మధ్య వివక్ష చూపవద్దని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆసుపత్రులను కోరింది. అదేవిధంగా బీమా పొందిన కొవిడ్-19 రోగులకు నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయో లేదో చూడాలని బీమా కంపెనీలను ఆదేశించింది. నగదు రహిత బీమా పాలసీలు ఉన్నప్పటికీ ఆసుపత్రి బిల్లుల పరిష్కారంలో నగదు చెల్లింపులను మాత్రమే ఎంచుకోవాలని వస్తున్న ఒత్తిడి గురించి కొవిడ్ బారిన పడిన వారి కుటుంబసభ్యులు ఫిర్యాదులు చేశారని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

ఈ క్రమంలోనే నగదు, నగదు రహిత బీమా పాలసీదారుల విషయంలో వివక్ష ఉండకూడదని ఆసుపత్రులను ఆదేశించాం. దీనికి సంబంధించి బీమా కంపెనీలకు కూడా లేఖ రాసినట్టు ఐఆర్‌డీఏఐ పేర్కొంది. బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య అవగాహన కొనసాగేలా చూడాలని కోరినట్టు వెల్లడించింది. మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఐఆర్‌డీఏఐ సభ్యుడు గణేష్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైన ఇబ్బందుల తొందరగానే పరిష్కారమవుతాయని నమ్ముతున్నట్టు చెప్పారు. అయితే, మహమ్మారి కొనసాగుతున్న సమయంలో సిబ్బంది కొరత, సెటిల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవడంలో ఆలస్యం వల్ల కరోనా రోగుల బీమా క్లెయిమ్‌ల సమస్యలు వచ్చాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.



Next Story