పాక్‌లో సర్జికల్ స్ట్రైక్.. ఇద్దరు బందీలకు విముక్తి

by  |
పాక్‌లో సర్జికల్ స్ట్రైక్.. ఇద్దరు బందీలకు విముక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్‌ను మంగళవారం రాత్రి ఇరాన్ సైన్యంలో సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్ దళం (ఐఆర్‌జీసీ) చేపట్టింది. పాక్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ ఇద్దరు సైనికులను విడిపించుకెళ్లింది.

వివరాల్లోకి వెళ్తే.. 2018లో బలూచిస్థాన్‌లోని జైష్ ఉల్ అదల్ అనే ఉగ్రవాద ముఠా 12 మంది ఇరాన్ సైనికులను బంధించింది. వారిని ఇరు దేశాల సరిహద్దుల్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మెర్కావా అనే నగరానికి తరలించారు. ఈ ముఠా కొన్నేళ్లుగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని నడుపుతోంది. ఇరాన్ సైనికులను విడిపించేందుకు ఇరు దేశాలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. 2018 నవంబర్‌లో ఐదుగురు బందీలకు విముక్తి లభించగా.. మరో నలుగురిని 2019లో విడిపించింది. తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్‌లో మరో ఇద్దరికి విముక్తి లభించింది.

జైష్ ఉల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థ ఇరాన్‌లో ఉగ్రవాద దాడులు చేసింది. ఇరాన్ సరిహద్దుల్లో భద్రతా బలగాలను బంధించి పాక్‌కు తీసుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. పాక్ తీరుపై ఇరాన్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది.



Next Story

Most Viewed