ఇరాన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన

by  |
ఇరాన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలో 2.5 కోట్ల మంది కరోనా సోకి ఉండవచ్చని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత వ్యాపించే ప్రమాదముందని రౌహనీ హెచ్చరించారు. వచ్చే మూడు నెలల్లో ఇరాన్ లో 3.5 కోట్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌లో ఫిబ్రవరిలో 2,70,000కు పైగా కరోనా కేసులు అధికారిక లెక్కల ప్రకారం నమోదయ్యాయి. 13,979 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,166 కొత్త కేసులు నమోదు కాగా.. 188 మంది మృతిచెందారు. అయితే ఆ దేశాధ్యక్షుడి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ దేశం చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది.

Next Story