ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు నో చాన్స్

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు నో చాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 30వ మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతుంది. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. దీనికి ముందు హోమ్ గ్రౌండ్ లో చెన్నై పై గెలిచిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచులో కూడా తమ ఫామ్ ను కొనసాగించి విజయం సాధించాలని చూస్తుంది. వరుస పరాజాయాలతో ఉన్న ఆర్సీబీ జట్టు ఇక నుంచి అన్ని విజయాలే కావాల్సి ఉండటంతో ఇకనుంచి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రోజు వేదికగా ఆర్సీబీ జట్టుకు హోం గ్రౌండ్ కావడంతో ఆ జట్టుకు కలిసొచ్చే అవకాశం ఉంది. కాగా ఆర్సీబీ జట్టులో వరుసగా విపలం అవుతున్న ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయిన మ్యాక్స్ వెల్, మహమ్మద్ సిరజ్ ను ఆర్సీబీ జట్టు బయట కుర్చోబెట్టింది. వారి స్థారంలో లాకీ ఫెర్గూసన్, మరో ప్లేయర్‌ను తీసుకుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(సి), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(w), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

ఇంపాక్ట్ ప్లేయర్స్: సుయాష్ ప్రభుదేసాయి, అనుజ్ రావత్, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రిపాఠి


Next Story

Most Viewed