రహదారుల భద్రత కు కొత్త ప్లాన్.. ఏంటంటే ?

by  |
car
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతో రహదారి భద్రతను అభివృద్ధి చేసేందుకు ఇంటెల్, ఐఎన్ఏఐ, ఐఐఐటీ-హైదరాబాద్, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, మహీంద్రా, ఎన్ఎంసీ కలిసి ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ద్వారా ఇంటిలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ(ఐఆర్ఏఎస్‌టీఈ) కార్యక్రమానికి ప్రయోగాత్మకంగా నాగ్‌పూర్‌లో రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో 50 శాతం వరకు తగ్గించేందుకు, ఏఐ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దేశీయంగా ఇతర నగరాల్లో సైతం ఈ నమూనాను మొదలుపెట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ చెప్పారు. వినూత్నమైన ప్రణాళికతో రహదారి భద్రతను పెంచే ఐఆర్ఏఎస్‌టీఈ ప్రాజెక్ట్ ద్వారా వాహనాల భద్రత, మొబిలిటీ పరిశోధనా, రహదారి మౌలిక సదుపాయాల భద్రత అనే మూడు కీలక అంశాలపై దృష్టి సారించనుంది.

ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతికతతో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ ద్వారా వాహనదారుల భద్రతను మెరుగుపరిచేందుకు వీలవుతుంది. ‘ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా వాహనాల ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారుల రక్షణను అందిస్తుంది. సంకేతిక పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా భారత్‌లో రోడ్డు భద్రతను పెంపోదించేందుకు, మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఇంటెల్ సహకరిస్తుంది. రహదారి భద్రతను పెంచి, దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించడానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాలు, సంస్థలు, పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని’ ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ అన్నారు.

Next Story

Most Viewed