అన్‌ఫినిష్డ్ స్టోరీల కోసం ఇన్‌స్టా న్యూ ఫీచర్.. స్టోరీ డ్రాఫ్ట్

by  |
‘Story Draft’ feature soon
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే ‘స్టోరీ డ్రాఫ్ట్’ అనే ఫీచర్‌ను లాంచ్ చేయబోతుంది. ఆ ఫీచర్ విశేషాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా ఏదో ఒక క్షణంలో మెరుపులాంటి ఆలోచన వస్తుంది లేదా ఏదైనా ట్రెండింగ్ టాపిక్ మీద ఒపీనియన్ చెప్పాలనుకుంటాం. వెంటనే ట్విట్టర్ లేదా ఇన్‌స్టా స్టోరీ ఓపెన్ చేసి నాలుగు పదాలు టైప్ చేయగానే.. కథ ఎంతకూ ముందుకు సాగదు. అలాంటి కథలను పోస్ట్ చేయలేం. దాంతో ఆ ‘అన్‌ఫినిష్డ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ’ల కథ అక్కడితో ముగిసిపోతుంది. కానీ ట్విట్టర్‌, జీమెయిల్‌లో అయితే ఇలాంటి అసంపూర్తి స్టోరీలను ‘డ్రాఫ్ట్’‌లా సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా అటువంటి అన్‌ఫినిష్డ్ స్టోరీలను కంప్లీట్ చేయొచ్చు లేదంటే ఎడిట్ చేచేసే వీలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్టా కూడా ‘స్టోరీ డ్రాఫ్ట్’తో తమ వినియోగదారులకు అలాంటి అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు ఇంతకుముందు ఏదైనా రాస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాక్ బటన్‌ను నొక్కితే, కంటెంట్ కోల్పోయేవాళ్లం. ఈ కొత్త ఫీచర్ సాయంతో అది కూడా డ్రాఫ్ట్‌లా సేవ్ కానుంది. అయితే స్టోరీ డ్రాఫ్ట్‌లను సేవ్ చేయడానికి పరిమితి ఉంటుందా అనేది ప్రస్తుతానికి తెలియదు.

‘త్వరలోనే స్టోరీ డ్రాఫ్ట్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతానికి అభివృద్ధి దశలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఎక్కువగా కోరిన ఫీచర్లలో ఇది ఒకటి’ అంటూ ఇన్‌స్టా హెడ్ అడమ్ మొస్సెరీ ఇన్ స్టా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు.



Next Story

Most Viewed