ఫీల్డ్ అసిస్టెంట్ల వినూత్న నిరసన

by  |
ఫీల్డ్ అసిస్టెంట్ల వినూత్న నిరసన
X

దిశ, మెదక్: ఎవరికైనా సమస్య వస్తే ఏం చేస్తారు? పై అధికారులకు ఫిర్యాదు చేయడమో లేక వినతి పత్రం ఇవ్వడమో జరుగుతుంది. అయితే ఇక్కడ ఓ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఇంతకీ ఆ చిత్ర పటం ఎవరిదో కాదు.. సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. సర్క్యులర్ నెంబర్ 4779 వ్యతిరేకంగా మార్చి 12 నుంచి 22 వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. ఈ సర్క్యులర్ గతేడాది డిసెంబర్‌లో విడుదలైందని.. దీంతో తమకు అన్యాయం జరుగుతోందని ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినితి పత్రం సమర్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు వెళ్లినట్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నేతలు రాజు, మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కరోనా రావడంతో మార్చి 23 విధులకు హాజరవుతామని అధికారులకు వినితి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో తమను విధుల్లోకి తీసుకోవాలని గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి వినితి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజు, మధు, మల్లికార్జున్, శ్రీనివాస్, తులసి, వెంకట్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed